ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్వరలో మలేసియాకి 'కబాలి'

Wed, Sep 30, 2015
'కబాలి' సినిమా యూనిట్ త్వరలో మలేసియాకి షిఫ్ట్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, ఆ తరువాత చిన్నగ్యాప్ తీసుకుని మలేసియా వెళ్లనుంది. రంజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రాధికా ఆప్టే అలరించనుంది.

రజనీకాంత్ మాఫియా డాన్ గా డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్న ఈ సినిమా, అక్టోబర్ 7 వరకూ చెన్నైలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ జరుపుకోనుంది. ఆ తరువాత అక్టోబర్ 15 నుంచి ఈ సినిమా షూటింగును మలేసియాలో ప్లాన్ చేశారు. దాదాపు అక్కడ 40 రోజుల పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తెలుగులోనూ రజనీకాంత్ కి భారీసంఖ్యలో ఫ్యాన్స్ ఉండటం వలన, ఈ సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయనున్నారు. అందుకోసం కథకి తగినదిగా .. రజనీ ఇమేజ్ కి తగినదిగా అనిపించే తెలుగు టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)