ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజకి కథ రెడీ చేస్తోన్న హరీష్ శంకర్

Wed, Sep 30, 2015
రవితేజ
రవితేజ
'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాతో రీసెంట్ గా హిట్ కొట్టిన హరీష్ శంకర్, రవితేజ కోసం ఒక మంచికథను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవితేజకి సరైన హిట్ ఇవ్వడం కోసమే ఆయన ఇలా రంగంలోకి దిగినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. మొదటినుంచి రవితేజతో హరీష్ శంకర్ కి మంచి స్నేహం వుంది. ఆయనని దర్శకుడిగా ప్రోత్సహించింది కూడా రవితేజనే.

'షాక్' సినిమాతో తనకి ఫ్లాప్ ఇచ్చినా, హరీష్ తో స్నేహం కారణంగా .. ఆయనపై నమ్మకంతోను రవితేజ 'మిరపకాయ్'కి ఓకే చెప్పాడు. అంతగా తనని నమ్మిన రవితేజ కోసం, హరీష్ శంకర్ ఒక కథను రెడీ చేస్తున్నాడు. కథతో పాటుగా ఆయనే స్క్రీన్ ప్లే ను .. మాటలను సమకూర్చుతాడట. తానే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ఎప్పుడు పట్టా లెక్కుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)