ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ నయనతార పెళ్లి టాపిక్!

Wed, Sep 30, 2015
నయనతార
నయనతార
నయనతార ప్రేమ వ్యవహారాలు .. పెళ్లి విషయాలు అప్పుడప్పుడు తెరపైకి రావడం ఆనవాయతీగా మారిపోయింది. అలాగే దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ఆమె వివాహం చేసుకోనుందనే టాక్ మరోమారు కోలీవుడ్లో షికారు చేస్తోంది. శింబు .. ప్రభుదేవాతో ఆమె ప్రేమ వ్యవహారాలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఆ తరువాత ఆర్యతో ఆమె చనువుగా ఉంటుందనే వార్తలు షికారు చేసినా, ఆర్య అందరితోను అలాగే ఉంటాడని సరిపెట్టుకున్నారు. ఇక దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ఆమె ప్రేమలో పడిందనే విషయం మాత్రం కోలీవుడ్లో బాగా ప్రచారమైంది. అలాంటిదేం లేదని ఈ జంట చెప్పిందే కానీ, చనువుగా మసలుకోవడం మాత్రం మానుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నయనతార చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని అనుకుంటున్నారు. మరి, ఈ విషయంపై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)