ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణి మూవీలో వాళ్లిద్దరూ లేరట!

Tue, Sep 29, 2015
మణిరత్నం
మణిరత్నం
మణిరత్నం ఓ విభిన్నమైన కథాచిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడనేసరికే అందరి దృష్టి ఆ వైపు మళ్లింది. ఆ సినిమాలో తమిళ్లో కార్తీ - కీర్తి సురేష్ .. మలయాళ లో నిత్యామీనన్ - దుల్కర్ సల్మాన్ జంటగా నటించనున్నారని తెలియడంతో మరింత ఆసక్తిని ప్రదర్శించారు. ఇది అనువాదంగా మాత్రమే తెలుగులో అడుగుపెడుతుందని తెలిసి, ఇక్కడి ప్రేక్షకులు కాస్త నిరాశకి లోనయ్యారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాను మణిరత్నం తెలుగులో కూడా తెరకెక్కించనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మలయాళ వెర్షన్ కోసం ఆయన నిత్యామీనన్ - దుల్కర్ సల్మాన్ ను అనుకున్నాడు. అయితే ఈ ఇద్దరి డేట్స్ ఈ మధ్య కాలంలో దొరికే పరిస్థితి లేకపోవడంతో, ఈ సినిమాను మలయాళలో తెరకెక్కించాలానే ఆలోచనని ఆయన విరమించుకున్నాడట. తమిళ్ తో పాటు తెలుగులో చేయాలనే ఉద్దేశంతో నటీనటుల అన్వేషణని ఆరంభించాడని అంటున్నారు. తెలుగులో ఈ ఛాన్స్ ఎవరికి దక్కేనో!
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)