ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్రహ్మోత్సవానికి ఎక్కువ తీసుకున్నాడట!

Mon, Sep 28, 2015
రావు రమేష్
రావు రమేష్
ఎంతటి బరువైన పాత్రైనా .. తన వైవిధ్యభరితమైన డైలాగ్ డెలివరీతో చాలా తేలికగా ఆ పాత్రని పండించే నటుడు రావు రమేష్. రావు గోపాలరావు వారసుడే అయినా తనదైన మేనరిజంతో ఆయన పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగాడు. తనదైన మాడ్యులేషన్ తో ప్రేక్షకులను కట్టిపడేసే రావు రమేష్, 'బ్రహ్మోత్సవం' సినిమాకి గాను అత్యధిక పారితోషికం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

గతంలో ఆయన రూపొందించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలోను రావు రమేష్ కి మంచి పాత్ర లభించింది. అలాగే ఆయన ఈ సినిమాలోనూ ప్రధానమైన పాత్రని పోషిస్తున్నాడు. ఇందుకోసం ఆయన కోటి రూపాయల వరకూ పారితోషికం తీసుకోనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వడం వలన ఆయన పారితోషికం ఎక్కువగా అనిపిస్తోందనీ, ఆయన పారితోషికం పెంచలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందోననే విషయమే అందరిలోను ఆసక్తిని పెంచుతోంది.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)