ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుబ్రమణ్యం తక్కువోడేం కాదు!

Mon, Sep 28, 2015
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
మొదటి సినిమా నుంచీ కూడా సాయిధరం తేజ్ ఒక కొత్త హీరోగా తెరపై బెరుకు .. బెరుకుగా కనిపించింది లేదు. డాన్స్ .. ఫైట్స్ .. కామెడీ .. లవ్ .. సెంటిమెంట్ .. ఇలా అన్నింటినీ చాలా చక్కగా పలికించి శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల విడుదలైన సాయిధరమ్ సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' .. ఆయన క్రేజ్ ను మరింత పెంచింది.

దిల్ రాజు నిర్మాణంలో .. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 24న విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజునే 4.16 కోట్లను రాబట్టిన ఈ సినిమా, మిగతా మూడు రోజులను కలుపుకుని 10 కోట్ల షేర్ మార్కును దాటినట్టు తెలుస్తోంది. హరీష్ శంకర్ ఎంచుకున్న కథ .. దానిని నడిపించిన తీరు .. సాయిధరమ్ - రెజీనా జోడీ పట్ల ఆడియన్స్ లో ఆసక్తి ఉండటం ..మిక్కీ జె.మేయర్ సంగీతం .. ఇవన్నీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)