ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అఖిల్' వేడుకకు రజనీకాంత్!

Mon, Sep 28, 2015
రజనీకాంత్
రజనీకాంత్
ఒక వైపున 'అఖిల్' సినిమాను గురించి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మరో వైపున 'అఖిల్' తమిళ ప్రేక్షకులను కూడా అలరించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా తమిళ్ రైట్స్ ను సొంతం చేసుకున్న సి.కల్యాణ్, అక్టోబర్ 22నే అక్కడ ఈ సినిమాను విడుదల చేయనున్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్ ను తమిళ ప్రేక్షకులకి ఒకసారి పరిచయం చేయాలనీ, ఆ కార్యక్రమానికి రజనీకాంత్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే బాగుంటుందని నాగార్జున భావించాడట.

రజనీకాంత్ ఒక సినిమా ఫంక్షన్ కి హాజరయ్యాడు అంటే, ఇక ఆ సినిమాను గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయవలసిన అవసరం దాదాపుగా ఉండదనే చెప్పాలి. అందువల్లనే రజనీకాంత్ ని సంప్రదించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ 'కబాలి' షూటింగులో బిజీగా వున్నాడు. ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతూ ఉండటంతో, ఆయన ఈ కార్యక్రమానికి వస్తాడా .. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)