ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భలే భలే వసూళ్లు రాబట్టాడు

Mon, Sep 28, 2015
నాని - లావణ్య త్రిపాఠి
నాని - లావణ్య త్రిపాఠి
'భలే భలే మగాడివోయ్' సినిమా పేరుకి తగినట్టుగానే భలే భలే వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. నాని - లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ఈ సినిమా, యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. గీతా 2 బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాకి మారుతి దర్శకుడిగా వ్యవహరించాడు. ఒక మతిమరపు యువకుడు తనలోని లోపాన్ని ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ సాగించే ప్రేమ ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కింది.

కొత్త పాయింట్ తో రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరించింది. విడుదల రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇంతవరకూ 25 కోట్ల షేర్ ను సాధించినట్టు తెలుస్తోంది. ఒక్క అమెరికాలోనే ఈ సినిమా 9.29 కోట్లను వసూలు చేసిందని అంటున్నారు. చిన్న సినిమాగా వచ్చినా .. కథలో కొత్తదనం వలన .. కథనంలో వేగం వలన ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ, చిన్న సినిమాలకి మరింత బలాన్నిచ్చేదిగా నిలిచింది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)