ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దసరాకి ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్!

Mon, Sep 28, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
దసరా పండుగ సందర్భంగా చరణ్ .. అఖిల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. దాంతో ఇటు మెగా అభిమానులు .. అటు అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఆతృతగా ఎదురుచూసేవారి జాబితాలో ఎన్టీఆర్ అభిమానులు కూడా చేరిపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజున ఆయన కొత్త ప్రాజెక్టు మొదలుకానుందట.

ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న 'నాన్నకి ప్రేమతో' సినిమా షూటింగు చాలాభాగం జరిగింది. దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఎన్టీఆర్ దృష్టిపెట్టాడని అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా ఉంటుందనే వార్త కొంతకాలంగా వినిపిస్తున్నదే. ఆ దర్శకుడితోనే ఎన్టీఆర్ సినిమా ఉంటుందనీ, దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా అక్టోబర్ 22న లాంఛనంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది. కాబట్టి ఈ దసరా ఎన్టీఆర్ అభిమానులకి కూడా ప్రత్యేకమేనని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)