ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిందీ 'శ్రీమంతుడు'గా హృతిక్ రోషన్

Sat, Sep 26, 2015
హృతిక్ రోషన్
హృతిక్ రోషన్
'శ్రీమంతుడు' మహేష్ బాబుకీ .. ఆయన అభిమానులకి పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించిన చిత్రంగా నిలిచింది. బిజినెస్ పరంగా ఈ సినిమాతో సంబంధమున్న వారంతా ఈ టైటిల్ కి తగిన విధంగానే శ్రీమంతులయ్యారు. అలాంటి ఈ సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారట. అయితే హిందీ శ్రీమంతుడులో హృతిక్ రోషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగులో శ్రీమంతుడు సినిమాను కొనుగోలు చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. మహేష్ బాబు పోషించిన పాత్రకి .. హృతిక్ రోషన్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి ఆయనని సంప్రదించినట్టుగా సమాచారం. లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు అందరినీ ఆలోచింపజేసే సందేశంతో రూపొందిన ఈ సినిమా, హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఈరోస్ సంస్థ వాళ్లు భావిస్తున్నారు. ఈ సినిమా గురించిన పూర్తివివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)