ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోగా తరుణ్ మళ్లీ ఎంటరయ్యాడు

Sat, Sep 26, 2015
తరుణ్
తరుణ్
బాల నటుడిగా .. లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తరుణ్, కొంత గ్యాప్ తరువాత హీరోగా మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా ఒక సినిమా లాంచ్ అయింది. ఇంత గ్యాప్ తీసుకున్నా ఆయన ప్రేమకథా చిత్రాన్ని ఎంచుకోవడం విశేషం. రెండు సంవత్సరాల క్రితం కన్నడలో విజయాన్ని సాధించిన 'సింపుల్ ఆగి ఒంద్ లవ్ స్టోరీ'కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.

బాలనటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న తరుణ్, కథానాయకుడిగా మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని పెద్ద బ్యానర్లలో ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేస్తూ యువ కథానాయకులలో ముందువరుసలో నిలిచాడు. ఆ తరువాత ఎందుకోగాని అతను సక్సెస్ లకు .. అవకాశాలకి కూడా దూరమయ్యాడు. అలాంటి తరుణ్ ఈ సినిమాతో మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్.వి.ప్రకాష్ నిర్మాణంలో రమేష్ గోపి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా, తరుణ్ కి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)