ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పాడట!

Fri, Sep 25, 2015
అల్లు అర్జున్
అల్లు అర్జున్
అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి దర్శకులంతా ఆసక్తి చూపుతుంటారు. సమయం దొరికితే చాలు ఆయనకి కథలు వినిపిస్తుంటారు. ఆయన మాత్రం కథ విషయంలోనూ .. దర్శకులను ఎంపిక చేసుకునే విషయంలోనూ చాలా జాగ్రత్తలు వహిస్తుంటాడు. అలాంటి అల్లు అర్జున్ .. తాజాగా ఒక దర్శకుడికి ఓకే చెప్పేశాడనే టాక్ వినిపిస్తుంది .. ఆ దర్శకుడి పేరే హరీష్ శంకర్.

మిరపకాయ్ .. గబ్బర్ సింగ్ సినిమాలతో దర్శకుడిగా హరీష్ శంకర్ తన టాలెంట్ ను చూపించాడు. ఇక 'సుబ్రమణ్యం ఫర్ సేల్' టీజర్స్ ఆసక్తిని రేకెత్తించేలా ఉండటంతో, ఈ సినిమా విడుదల కాగానే అల్లు అర్జున్ తన భార్యతో కలిసి చూశాడట. ఈ సినిమాను హరీష్ తెరకెక్కించిన తీరు ఆయనకి బాగా నచ్చిందట. అటు యూత్ ను .. ఇటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమెలాగో హరీష్ కి బాగా తెలుసని భావించిన ఆయన, తన స్టైల్ కి తగిన కొత్త కథను రెడీ చేయమంటూ హరీష్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)