ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

50 రోజుల 'శ్రీమంతుడు'

Fri, Sep 25, 2015
బంధాలు .. అనుబంధాల మేళవింపుతో బలంగా అల్లుకున్న ఒక కథ ప్రేక్షకులను ఎంతలా ప్రభావితం చేయగలదనే విషయాన్ని నిరూపించిన చిత్రం 'శ్రీమంతుడు'. సమాజ అభివృద్ధికి సంబంధించిన ఒక సందేశాన్ని అర్థవంతంగా .. వినోదాత్మకంగా అందించిన చిత్రం శ్రీమంతుడు. కేవలం కథా కథనాలపై ఆధారపడిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 185 థియేటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను కొరటాల శివ అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. మహేష్ ఇమేజ్ .. శ్రుతిహాసన్ క్రేజ్ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం తోడవడంతో, ఇది మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. బలమైన కథా కథనాలతో .. పాత్రలకి తగిన నటీనటులతో .. ఆద్యంతం పట్టుగా ఈ సినిమాను నడిపించడం వలన ఈ విజయం సాధ్యమైంది. మహేష్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన శ్రీమంతుడు, 50 రోజుల పండుగను జరుపుకుంటున్నాడు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)