ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దసరాకి భయపెట్టనున్న రాయ్ లక్ష్మీ

Thu, Sep 24, 2015
'శివగంగ' లో ఓ దృశ్యం
'శివగంగ' లో ఓ దృశ్యం
దసరా పండుగ సందర్భంగా బరిలోకి దిగడానికి స్టార్ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. పోటీని తట్టుకోవడం కష్టమనుకున్న కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక హారర్ సినిమా మాత్రం ఈ పోటీలోకి ఎంటర్ అవుతోంది. రాయ్ లక్ష్మీ - శ్రీరామ్ జంటగా రూపొందిన ఆ సినిమా పేరే 'శివగంగ'.

తెలుగు .. తమిళ భాషా ప్రేక్షకులను పలకరించనున్న ఈ సినిమాకి వి.సి.ఉదయన్ దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రతీకారం తీర్చుకునే ఆత్మలుగా ఈ సినిమాలో నాయకా నాయికలు కనిపిస్తారు. భయాన్ని ఇష్టంగా భరించే ప్రేక్షకులని ఈ సినిమా నిరాశపరచదని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. గతంలో ఇలా హారర్ నేపథ్యంలో వచ్చిన చంద్రముఖి .. కాంచన .. చంద్రకళ సినిమాలు సక్సెస్ బాటలో పయనించాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)