ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ తో హరీష్ శంకర్ సినిమా?

Thu, Sep 24, 2015
హరీష్ శంకర్ - పవన్ కల్యాణ్
హరీష్ శంకర్ - పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ .. హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. వాళ్ల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. నిర్మాత దిల్ రాజు .. హరీష్ శంకర్ ఆయా సందర్భాల్లో చేసిన ప్రకటనలు, ఈ ఊహాగానాలకి తెరతీశాయి. తాను పవన్ కల్యాణ్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాననీ, ఆయనతో ఆ కథను తెరకెక్కించాలని అనుకుంటున్నానని ఆ మధ్య హరీష్ శంకర్ అన్నాడు.

ఆ సమయంలోనే .. తన నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని దిల్ రాజు ప్రకటించాడు. దాంతో దిల్ రాజు నిర్మాతగా .. హరీష్ శంకర్ దర్శకుడిగా పవన్ కల్యాణ్ తో ఒక సినిమా చేయనున్నారనే టాక్ మొదలైంది. తాను ఎప్పుడూ పవన్ కి ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానంటూ, తరచూ పవన్ పట్ల హరీష్ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అందువలన వీళ్ల కాంబినేషన్లో ఒక సినిమా వచ్చే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)