ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెజీనా జోరు పెరిగింది

Thu, Sep 24, 2015
రెజీనా
రెజీనా
రెజీనా .. ఇప్పుడు ఈ పేరును తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనవసరం లేదు. ఎందుకంటే, ఈ సుందరి వరుసగా సినిమాలు చేసేస్తూ, అందరి కళ్లలోను నానుతోంది. కెరియర్ ఆరంభంలో తడబడినా ఆ తరువాత ట్రాక్ ఎక్కేసింది. 'కొత్త జంట' సినిమా నుంచి ఈ అమ్మాయికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక 'పిల్లా నువ్వులేని జీవితం' ఇచ్చిన హిట్ తో మరింత ఉత్సాహంగా ఆమె దూసుకుపోతోంది.

చురుకుదనానికి చిరునామాగా అనిపించే ఈ అమ్మాయి, ఈ రోజున 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథానాయికగా ఈ సినిమాలోనూ మంచి మార్కులు కొట్టేసిన రెజీనా, త్వరలో గోపీచంద్ జోడీగాను అలరించనుంది. ఇక నారా రోహిత్ సరసన 'శంకర'లో ఛాన్స్ పొందిన ఈ చిన్నది, తాజాగా మంచు మనోజ్ సినిమా 'శౌర్య'లోను కథానాయికగా ఎంపిక అయింది. యువ కథానాయకులతో సినిమాలను ప్లాన్ చేసుకుంటోన్న దర్శక నిర్మాతలు, రెజీనాకి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారట. దాంతో ఒక వైపున కథలు వింటూ .. మరో వైపున షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ అయిపోయిందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)