ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శాలినీ బాటలోనే షామిలి

Wed, Sep 23, 2015
షామిలి
షామిలి
శాలిని .. షామిలి బాల తారలుగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. కాలక్రమంలో శాలిని కథానాయికగా కొన్ని తమిళ .. మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక షామిలి కూడా ఆ మధ్య 'ఓయ్' సినిమాలో కథానాయికగా అలరించింది. ఆ తరువాత చదువు నిమిత్తం విదేశాలకి వెళ్లిన ఈ అమ్మాయి, అక్కడి నుంచి తిరిగి రాగానే నటన పైనే దృష్టి పెట్టింది. ప్రస్తుతం ధనుష్ .. విక్రమ్ ప్రభు సరసన నటిస్తోంది.

అయితే షామిలి గ్లామర్ ఒలకబోసే పాత్రలకు ఓకే చెబుతుందా .. లేదా? అనే సందేహం ప్రేక్షకులకి లేకపోలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన రాగా, ఆమె సమాధానమిచ్చింది. పాత్ర పరిధిలో మాత్రమే నటిస్తాననీ, గ్లామర్ ఒలకబోసే పాత్రల విషయంలో తాను తన అక్క రూట్లోనే వెళతానని చెబుతోంది. గతంలో శాలినీ మాదిరిగానే కథానాయిక పాత్రల్లో పద్ధతిగా కనిపిస్తానని అంటోంది. మరి ఈ అమ్మడికి ఏ స్థాయిలో అవకాశాలు దొరుకుతాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)