ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హారర్ పై దృష్టి పెట్టిన కృష్ణవంశీ

Wed, Sep 23, 2015
కృష్ణవంశీ
కృష్ణవంశీ
కృష్ణవంశీ ఒక హారర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడనే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడని వినిపిస్తోంది. కృష్ణవంశీ పేరు వినగానే అందమైన ప్రేమ కథాచిత్రాలు .. అనుబంధాలకి అర్థం చెప్పే చిత్రాలు .. సమాజానికి సందేశాన్నిచ్చే చిత్రాలు కనులముందు కదలాడతాయి. జయాపజయాల విషయం పక్కన పెడితే, టేకింగ్ విషయంలో కృష్ణవంశీకి ఎప్పుడూ నూటికి నూరు మార్కులు పడుతూనే వుంటాయి.

అలాంటి కృష్ణవంశీ నుంచి 'గోవిందుడు అందరివాడేలే' తరువాత సినిమా రాలేదు. అయితే ఆయన ఒక హారర్ కథాంశంతో కూడిన కథని సిద్ధం చేసుకుంటున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు వున్నాయని అంటున్నారు. మరి హారర్ కథాంశంతో కృష్ణవంశీ ఏ స్థాయిలో భయపెడతాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)