ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐటమ్ భామగా ప్రియమణి!

Tue, Sep 22, 2015
ప్రియమణి
ప్రియమణి
గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న 'సరైనోడు' చిత్రం చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ మేటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఒక ఐటంసాంగ్ ఉందనే విషయం బయటికి రావడంతో, బన్నీతో కలిసి ఈ ఐటమ్ లో సందడి చేయనున్న భామ ఎవరనే సందేహానికి తెరలేచింది. ఈ విషయంగా ఫిల్మ్ నగర్లో జరుగుతోన్న చర్చల్లో ఎక్కువగా ప్రియమణి పేరు వినిపిస్తోంది.

తన మార్కు యాక్షన్ కి ... బన్నీ స్టైల్ ను జోడించి బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాంతో .. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంగా యూత్ కుతూహలంతో వుంది. ఈ నేపథ్యంలో .. ఐటంసాంగ్ కోసం ప్రియమణిని సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే .. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కన్నడ సినిమాల వైపు వెళ్లిన ప్రియమణికి, ఇది ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)