ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాలకి మహేశ్ ఖరీదైన గిఫ్ట్!

Mon, Sep 21, 2015
కొరటాల శివ
కొరటాల శివ
కొరటాల శివను మహేశ్ బాబు సర్ ప్రైజ్ చేశాడనీ .. ఖరీదైన 'ఆడి ఎ6' కారును ఆయనకి కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కొరటాల శివ - మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మహేశ్ క్రేజ్ ను .. ఆయన మార్కెట్ ను మరింత పెంచింది. వివిధ చిత్ర పరిశ్రమలు మహేశ్ గురించి మాట్లాడుకునేలా చేసింది.

దాంతో తనకి ఇంతటి విజయాన్ని అందించిన కొరటాల శివని సంతోషపెట్టడం తన బాధ్యత అనిపించిందేమో, ఆయనని జూబ్లీ హిల్స్ లోని ఆడి షోరూమ్ దగ్గరికి రమ్మని నిన్న మహేశ్ ఫోన్ చేశాడట. ఎందుకై వుంటుందీ .. అనుకుంటూ అక్కడికి వెళ్లిన శివకి, మహేశ్ నవ్వుతూ ఎదురువచ్చాడట. అక్కడున్న 'ఆడి ఎ6' కారును చూపిస్తూ, దాని 'కీస్'ను శివ చేతిలో పెట్టాడట. అంతే ఆనందంతో శివ పొంగిపోయాడని అంటున్నారు. మహేశ్ మంచి మనసును గురించి చెప్పుకునే విషయాల్లో తాజాగా ఈ గిఫ్టు కూడా చేరిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)