ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రకాశ్ రాజ్ కి డేట్స్ లేవట!

Mon, Sep 21, 2015
ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్
తెలుగు .. తమిళ .. హిందీ భాషా ప్రేక్షకులకి ప్రకాశ్ రాజ్ పేరు సుపరిచితం. పాత్ర ఏదైనా ప్రకాశ్ రాజ్ తప్ప మరెవరూ ఆ పాత్రని అంతలా పండించలేరని అనిపించేలా నటించడం ఆయన ప్రత్యేకత. అలాంటి ప్రకాశ్ రాజ్ .. 'కబాలి' సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రంజిత్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, వినాయకచవితి రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఒక ప్రధానమైన పాత్రను పోషించనున్నాడు. అయితే ఈ సినిమా కోసం 60 రోజుల పాటు ఆయన డేట్స్ అడగడంతో, ప్రకాశ్ రాజ్ ఆలోచనలో పడ్డాడట. ఎందుకంటే ఈ రెండు నెలల్లో ఆయన ఆయా భాషలకి సంబంధించిన దర్శక నిర్మాతలకి డేట్స్ ఇచ్చి ఉన్నాడు. సర్దుబాటు చేయడానికి కూడా వీలు లేకపోవడంతో, రజనీతో కలిసి నటించే ఛాన్స్ ను ఆయన అయిష్టంగానే వదులుకున్నట్టుగా చెబుతున్నారు. మరి ఆ పాత్రకిగాను ఎవరిని తీసుకుంటారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)