ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అమ్మ' పాత్రంటే ఇష్టమంటోన్న శ్రీదేవి

Mon, Sep 21, 2015
శ్రీదేవి
శ్రీదేవి
'అమ్మ' పాత్రంటే ఇష్టం .. అందుకే ఆ పాత్రలో ఇంతకాలంగా లీనమైపోయానని చెబుతోంది శ్రీదేవి. తమిళ్లో ఆమె నటించిన 'పులి' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె ఈ మాటను అంది. అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలుగుతోన్న సమయంలో, సుదీర్ఘమైన విరామం ప్రకటించడానికి కారణమేమిటని అడిగిన ప్రశ్నకి, ఆమె ఎంతో నిజాయతీగా సమాధానం ఇచ్చింది.

జీవితంలో 'అమ్మ' పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, ఆ పాత్రని బాధ్యతాయుతంగా నిర్వహించడం వలన కలిగే ఆనందం .. అనుభూతి మాటల్లో చెప్పలేనిదని అంది. పిల్లలకి తల్లిప్రేమ అవసరమైన సమయంలో, తాను సినిమాలంటూ వాళ్లకి దూరం కావడం సరైనది కాదనీ, అందుకే దగ్గరగా వుంటూ వాళ్ల అవసరాలు .. అభిప్రాయాలు తెలుసుకుంటూ తల్లి పాత్రకి అంకితమయ్యానని చెప్పింది.
'అమ్మ' పాత్రకి పూర్తి న్యాయం చేయగలిగాననే సంతోషమే తప్ప, సినిమా అవకాశాలు దూరమవుతున్నాయనే బాధ తనకి ఎప్పుడూ కలగలేదని చెప్పుకొచ్చింది. నిజంగానే కోట్ల రూపాయలకన్నా, తన పిల్లల శ్రేయస్సు మాత్రమే ముఖ్యమనుకోవడం ఒక్క తల్లికి తప్ప మరెవరికి సాధ్యమవుతుంది?
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)