ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికాలో రెజీనా ఏడ్చేసిందట!

Mon, Sep 21, 2015
రెజీనా
రెజీనా
రెజీనా ఏడ్చేసిందట .. స్టార్ హీరోతో చేసే ఛాన్స్ మిస్ అయినందుకు కాదు .. తనకి యాక్టింగ్ రావడం లేదేమోననే బాధతో. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పింది. రెజీనాకి యాక్టింగ్ రాకపోవడమేంటి? మంచి చురుకుగా .. చలాకీగా కుర్రాళ్ల చూపులను తనచుట్టూ బాగానే తిప్పుకుంటుందిగా అనుకోవడం సహజం. అయితే విపరీతమైన చలిలో రొమాంటిక్ గా నటించలేక అమ్మడు అవస్థలు పడిందట పాపం.

సాధారణంగా మంచు ప్రదేశాల్లో కబుర్లు చెప్పుకోవలసి వచ్చినా .. పాటలు పాడుకోవలసి వచ్చినా హీరో ఒంటినిండా మందపాటి దుస్తులు ధరిస్తాడు. కథానాయిక మాత్రం అంతంత మాత్రం డ్రెస్ తో సరిపెట్టుకుంటుంది. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా కోసం కూడా రెజీనా అలా రొమాంటిక్ గా కనిపించవలసి వచ్చింది. అందుకోసం అమెరికాలో న్యూజెర్సీ లోని ఒక నది ఒడ్డున .. చలిలో ఒక సన్నివేశాన్ని ప్లాన్ చేశారు. అంతచలిలో .. చెప్పవలసిన డైలాగులు గుర్తుకు రాక, అమ్మడు టేకుల మీద టేకులు తీసుకుంటూ, తనకి యాక్టింగ్ రావడం లేదేమోననే బాధతో ఏడ్చేసిందట. తర్వాత బాగానే చేసి శెభాష్ అనిపించుకుంది లెండి...అదీ విషయం...!
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)