ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేష్ నెక్స్ట్ మూవీ దర్శకుడు అతనేనట!

Sat, Sep 19, 2015
మహేష్ బాబు
మహేష్ బాబు
'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగులో మహేష్ బాబు జాయినయ్యాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చకచకా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుందనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల్లో ఎక్కువగా 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఇష్క్ .. మనం .. సినిమాలు విక్రమ్ కుమార్ టేకింగ్ స్టైల్ కి అద్దం పడుతుంటాయి.

తెరపై కొత్తదనాన్ని అందంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆయన చెప్పిన కథను శ్రద్ధగా విన్న మహేష్ సంతృప్తిని వ్యక్తం చేశాడట. అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమెలాగో విక్రమ్ కుమార్ కి బాగా తెలుసు. అందువలన 'బ్రహ్మోత్సవం' తరువాత మహేష్ ఆయన సినిమా చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈలోగా విక్రమ్ కుమార్ కూడా సూర్యతో తెరకెక్కిస్తోన్న సినిమాను ఫినిష్ చేస్తాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)