ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జోరు పెంచుతోన్న 'జబర్దస్త్' భామ

Sat, Sep 19, 2015
రష్మీ
రష్మీ
బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్స్ కొంతమంది ఆ తరువాత సినిమాలవైపు అడుగులు వేశారు. అలాంటివారిలో అనసూయ తరువాత జబర్దస్త్ రష్మీ కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి పాప్యులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మాయి, ఇక సినిమాలపైనే శ్రద్ధ పెట్టనుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో కొన్ని సినిమాల్లో మెరిసిన రష్మీ, గుంటూరు టాకీస్ .. చారుశీల సినిమాల్లో కథానాయికగా నటించింది.

కథానాయికగా అవకాశాలు వస్తుండటంతో, ఇక పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించాలని ఈ అమ్మాయి డిసైడైపోయిందని అంటున్నారు. గ్లామర్ తో పాటు చలాకీగా కనిపించే ఈ అమ్మాయి, ఇక తన జోరు పెంచడానికి రెడీ అవుతోందని చెబుతున్నారు. మరి రష్మీ కూడా స్వాతి .. అవికాగోర్ మాదిరిగానే కథానాయికగా నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)