ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీకాంత్ తో 'అమ్మ' రాజశేఖర్

Sat, Sep 19, 2015
శ్రీకాంత్
శ్రీకాంత్
ఒక వైపున తన కుమారుడు 'రోషన్'ను కథానాయకుడిగా పరిచయం చేస్తూనే, శ్రీకాంత్ కూడా కథానాయకుడిగా బిజీగా ఉండటం విశేషం. ఆయన తాజా చిత్రం 'టెర్రర్' .. త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాపై శ్రీకాంత్ మంచి నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మరో కొత్తకథకి ఓకే చెప్పినట్టుగా సమాచారం.

'అమ్మ' రాజశేఖర్ వినిపించిన ఒక కథ నచ్చడంతో శ్రీకాంత్ వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. గతంలో గోపీచంద్ తో 'రణం' సినిమాని తెరకెక్కించిన రాజశేఖర్, కొత్త గ్యాప్ తరువాత చేస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీకాంత్ జోడీగా ఆయన నవనీత్ కౌర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలు శ్రీకాంత్ కి ఎలాంటి ఫలితాలను అందిస్తాయనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)