ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మాట' మీద దృష్టి పెట్టిన రకుల్!

Fri, Sep 18, 2015
రకుల్
రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ ను చూడగానే ఈ అమ్మాయి అందమైనదే కాదు .. తెలివైనది కూడానని అనిపించక మానదు. ఎంత తీరిక లేకుండా పనిచేస్తే అంత ఆనందంగా ఉంటుందంటూ, చకచకా సినిమాలు చేసుకెళుతోన్న ఈ సుందరి, త్వరలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'సరైనోడు'లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతోంది.

తెలుగు భాష నేర్చుకుని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకునే కథానాయికలు లేకపోలేదు. అయితే వాళ్లందరి కన్నా దూకుడుగా రకుల్ ఉండటం విశేషం. ఒక భాషలో కథానాయికగా అడుగుపెట్టడమే ఆలస్యం, అక్కడి భాషని నేర్చుకోవడం బెటర్ అని భావించి, వెంటనే ఆ పనికి శ్రీకారం చుడుతుందట. ఈ మధ్య ఆమె తెలుగును చక్కగా మాట్లాడుతూ ఉండటంతో .. తమ సినిమా నుంచే డబ్బింగ్ స్టార్ట్ చేయమని బోయపాటి .. బన్నీ సలహా ఇచ్చారట. అంతే .. రకుల్ కూడా అలాగే డిసైడై పోయిందని అంటున్నారు. అమ్మడి స్పీడ్ చూస్తుంటే .. త్వరలో తన పాత్రకి తానే పాటలు పాడుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)