ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పాటేసుకుంటోన్న మహేష్ బాబు

Fri, Sep 18, 2015
మహేష్ బాబు
మహేష్ బాబు
'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది .. పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుందనే విషయం తెలిసిందే. మొదటి అయిదు రోజులు ఒక పాటను చిత్రీకరిస్తారని తెలియడంతో, దాని నేపథ్యం తెలుసుకోవాలనే కుతూహలం అభిమానులలో కలిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సినిమాలో ఈ పాట సంగీత్ కార్యక్రమాన్ని జరుపుకోవడంలో భాగంగా వస్తుందట.

కథాపరంగా ఈ వేడుకలో, మహేష్ .. ప్రణీత .. జయసుధ .. తులసి .. రావు రమేష్ .. నరేష్ తదితరులు పాల్గొంటారు. అందువలన వాళ్లంతా కలిసి డాన్స్ చేసే దృశ్యాలను ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. వీనులవిందు చేసే ఈ పాటను తెరపై కలర్ ఫుల్ గా ఆవిష్కరించడానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కృషి చేస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచానాలు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)