ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'పంజా' దర్శకుడితో పవన్ సినిమా!

Fri, Sep 18, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
'పంజా' దర్శకుడితో పవన్ సినిమా .. ఇప్పుడు టాలీవుడ్లో ఇదే టాపిక్ హల్ చల్ చేస్తోంది. పవన్ నిజంగానే ఈ సినిమా చేస్తాడా? అంటూ కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా. అందుకు కారణం అప్పట్లో 'పంజా' సినిమా పరాజయం పాలు కావడమే. 2011లో వచ్చిన ఈ సినిమాకి కోలీవుడ్ కి చెందిన విష్ణువర్ధన్ దర్శకుడిగా వ్యవహరించాడు. పవన్ అభిమానులను ఈ సినిమా నిరాశపరచడంతో, ఆయన ఇక తెలుగు సినిమాలపై దృష్టి పెట్టలేదు.

ఇక ఈ మధ్యనే ఆయన పవన్ ని కలిసి ఒక లైన్ వినిపించాడట. జయాపజయాలను పక్కన పెడితే, దర్శకులలో గల ప్రతిభను గుర్తించడంలోను .. చాన్స్ ఇవ్వడంలోను పవన్ ఎప్పుడూ ముందే వుంటాడు. అందుకే గతంలో అతనిచ్చిన ఫెయిల్యూర్ ని పట్టించుకోకుండా లైన్ విన్నాడనీ .. అది నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడని అంటున్నారు. ఈసారి పవన్ తో కలిసి హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్న విష్ణువర్ధన్, ఈ కథపైనే కసరత్తు చేస్తున్నాడని సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)