ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందాల 'అనుపమ'కి ఆఫర్ల వెల్లువ!

Wed, Sep 16, 2015
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పేరే వినిపిస్తోంది. మలయాళ .. తమిళ .. సినీజనాలే కాదు, తెలుగులోనూ ఈ అమ్మాయి గురించి మాట్లాడుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మూడు భాషలలోని యువకథానాయకులు ఈ అమ్మాయికి మొదటి ప్రాధాన్యతను ఇస్తుండటం విశేషం. మలయాళ చిత్రం 'ప్రేమమ్' సినిమా సూపర్ హిట్ కావడంతో, ఆ సినిమాలో నటించిన ఈ అమ్మాయి మిగతా చిత్రపరిశ్రమలలోని ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.

దాంతో అన్ని వైపుల నుంచి ఈ అమ్మాయికి అవకాశాలు వరుసగా వచ్చిపడుతున్నాయి. 'ప్రేమమ్' తెలుగు రీమేక్ కోసం వచ్చిన ఈ అమ్మాయిని చూసిన త్రివిక్రమ్, 'అ .. ఆ' సినిమాలో రెండో కథానాయికగా ఎంపిక చేశాడు. ఇక దిల్ రాజు కూడా తాను రవితేజతో నిర్మిస్తోన్న సినిమాకి గాను ఈ అమ్మాయిని ఒక కథానాయికగా ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఈ అమ్మాయి నిలదొక్కుకోవడానికి ఎంతో సమయం పట్టదనే టాక్ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)