ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'టిప్పు సుల్తాన్' సినిమా వివాదం!

Sat, Sep 12, 2015
రజనీకాంత్
రజనీకాంత్
ఇప్పుడు కోలీవుడ్లో ఎక్కడ చూసినా 'టిప్పు సుల్తాన్' సినిమా గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రజనీ నటిస్తాడా .. కమల్ నటిస్తాడా? అనే విషయంపై హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. భారీ చారిత్రాత్మక చిత్రంగా 'టిప్పు సుల్తాన్'ను నిర్మించాలని కర్ణాటకకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ కేని నిర్ణయించుకున్నాడట.

ఈ విషయం బయటికి రాగానే .. ఆ సినిమాలో రజనీ ఎలా చేస్తాడు? ఆల్రెడీ తాను ఆ సినిమా చేయనున్నట్టుగా కమల్ ప్రకటించాడనే టాక్ కూడా షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో .. రజనీతో టిప్పు సుల్తాన్ సినిమా నిర్మాణాన్ని తలపెట్టడాన్ని హిందూ సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. సినిమా విషయంలో స్పష్టమైన ప్రకటన వెలువడకపోయినా, ఆ సినిమాలో రజని నటించవద్దంటూ వ్యతిరేకత బయలుదేరింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ ఎలా స్పందిస్తాడో .. కమలహాసన్ ఏం చేస్తాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)