ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాయ్ లక్ష్మీది అదేమాట!

Sat, Sep 12, 2015
రాయ్ లక్ష్మీ
రాయ్ లక్ష్మీ
తెలుగు తెరకి ఆమె పరిచయమై చాలా కాలమే అయినా, తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలేనని చెప్పాలి. అలా అని ఆమె ఖాళీగా లేదు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో నటిస్తూ, హిందీలో కుదురుకోవడానికి ప్రయత్నిస్తోంది. భారీ అందాల భామగా పేరు తెచ్చుకున్న ఆ కథానాయికయే రాయ్ లక్ష్మీ.

నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 10 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ సుందరి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోభావాలను వెల్లడించింది. ఈ సందర్భంలోనే .. ఎవరినైనా ప్రేమించారా? అని అడిగిన ప్రశ్నకి ఆమె తనదైన శైలిలో స్పందించింది. తాను సినిమాను మాత్రమే ప్రేమిస్తున్నానని తేల్చిచెప్పింది. గతంలో ఒక సందర్భంలో కాజల్ ఇలాగే చెప్పింది .. ఇటీవల తమన్నా కూడా అలాగే చెప్పింది. ఇప్పుడు రాయ్ లక్ష్మీది కూడా అదేమాట! ఇకపై ఎవరూ ఈ ప్రశ్న వేయకుండా కథానాయికలకు ఓ తిరుగులేని ఆన్సర్ దొరికిపోయిందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)