ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికాలో 'శ్రీమంతుడు' వేడుక!

Sat, Sep 12, 2015
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
చక్కని సందేశంతో కూడిన కథాబలంతో వచ్చిన 'శ్రీమంతుడు' అంచనాలకి మించిన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓవర్సీస్ లోను తెలుగు సినిమా మార్కెట్ ను పెంచింది. గతంలో వచ్చిన మహేష్ సినిమాలకి మించిన వసూళ్లను ఈ సినిమా అక్కడ సాధించింది. ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా 40 రోజులకు దగ్గరలో ఉంది.

దాంతో ఈ సినిమా 50 రోజుల వేడుకనుగానీ, థ్యాంక్స్ మీట్ ను గాని అమెరికాలో నిర్వహిస్తే బాగుంటుందని ఈ సినిమా టీమ్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు యూఎస్ లో ఉంటున్న ప్రవాసాంధ్రులు కావడం కూడా ఈ ఆలోచనకి ఒక కారణమని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వలన అక్కడి తెలుగు సినిమా ప్రేక్షకులకి ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్ తో సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నట్టుగా సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)