ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కబాలి' లో రజనీది ద్విపాత్రాభినయమా?

Wed, Sep 09, 2015
రజనీకాంత్
రజనీకాంత్
'కబాలి'లో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? అనే సందేహం ఇప్పుడు కోలీవుడ్ కుర్రకారులో తలెత్తుతోంది. ఇటీవల రజనీ పోలీస్ డ్రెస్ లోను ఫోటో షూట్ లో పాల్గొనడమే అందుకు కారణం. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం దగ్గరపడుతున్న కొద్దీ రజనీకాంత్ మరింత ఉత్సాహంగా ఉంటున్నారట. అందుకు కారణం ఈ సినిమాలోని కొత్త పాయింట్ ఆయనకి బాగా నచ్చడమేనని చెబుతున్నారు.

సెప్టెంబర్ 17న .. అంటే వినాయక చవితి తోజున ఈ సినిమా షూటింగును ఆరంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమా కోసం చెన్నై - సాలిగ్రామంలోని మోహన్ స్టూడియోలో భారీ సెట్ వేశారు. షూటింగును ప్రారంభించిన రోజునే ఫస్టులుక్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకూ ఈ సినిమాలో రజనీకాంత్ డాన్ గా కనిపిస్తారనే ప్రచారం మాత్రమే జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల పోలీస్ డ్రెస్ లోను రజనీపై ఫోటో షూట్ జరగడంతో, ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయవలసిందే.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)