ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మారుతి నెక్స్ట్ మూవీలో హీరో?

Tue, Sep 08, 2015
మారుతి
మారుతి
దర్శకుడిగా మారుతి తెరకెక్కించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా విడుదలై, సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడంతో, ఆయన తదుపరి మూవీ ఏ హీరోతో ఉంటుందనే విషయంగా ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. ఒక సినిమా విజయాన్ని సాధించాలంటే యూత్ ఆదరణ ఎక్కువగా కావాలి. అలాంటి యూత్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి. యూత్ ని ఆకట్టుకునే కథాంశాలను ఎంచుకుని, ఆసక్తికరంగా .. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత.

అలాంటి కంటెంట్ తో .. కాన్సెప్టు తో ఆయన రూపొందించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా యూత్ ని మెప్పించింది. దాంతో ఆయన తదుపరి సినిమా రాజకీయనాయకుడు గంటా శ్రీనివాసరావు కొడుకుతో ఉండవచ్చని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు కొడుకును కథానాయకుడిగా పరిచయం చేయనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ల వచ్చని అంటున్నారు. ఆ తరువాత సినిమా వెంకటేష్ తో ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా వచ్చిన హిట్ తో మారుతి మరేదైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)