ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రోడ్ పై దూసుకెళ్తోన్న సాయిధరమ్ తేజ్

Tue, Sep 08, 2015
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ రోడ్ పై వేగంగా దూసుకెళుతున్నాడు .. తాను ఎవరినైనా వెంబడిస్తున్నాడా? లేదంటే తానే తప్పించుకుంటున్నాడా? అనేది చూసేవారికి తెలియని పరిస్థితి. అలాంటి దృశ్యాన్ని 'తిక్క' సినిమా కోసం దర్శకుడు సునీల్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ - లారిస్సా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీ రోడ్ పై చిత్రీకరిస్తున్నారు.

సినిమాలో హైలైట్ గా నిలిచే ఈ దృశ్యాల చిత్రీకరణ ఈ నెల 10వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ నెల 24న సాయిధరమ్ తేజ్ నటించిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' విడుదల కానుంది. ఈ లోగానే ఆయన 'తిక్క' సినిమా షూటింగులో బిజీగా ఉండటం విశేషం. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో మేనమామ పాలసీని అనుసరిస్తోన్న సాయిధరమ్ తేజ్, అంతే స్పీడుతో సినిమాలు చేస్తుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)