ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సుబ్రమణ్యం ఫర్ సేల్'కి ప్లాటినం డిస్క్!

Mon, Sep 07, 2015
సాయిధరం తేజ్
సాయిధరం తేజ్
సాయిధరం తేజ్ .. రెజీన నాయకా నాయికలుగా నటించిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా, షూటింగు పూర్తిచేసుకుని విడుదలకి అవసరమైన ఏర్పాట్లు చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పాటలకి మంచి స్పందన రావడంతో, ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను జరపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఇటీవల విడుదలైన ఈ పాటలకు యూత్ నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఈ నెల 19న తిరుపతిలో ఘనంగా జరపాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని అంటున్నారు. తేదీని ఖరారు చేస్తూ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)