ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరోసారి సూపర్ స్టార్ తో దీపిక

Sun, Sep 06, 2015
దీపిక
దీపిక
ఆమధ్య 'కొచ్చాడియాన్' చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి నటించిన బాలీవుడ్ భామ దీపికా పదుకొనే మరోసారి ఆయనతో జత కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా 'రోబో 2' చిత్రాన్ని రూపొందించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులో కథానాయికగా కత్రినా కైఫ్ నటించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడీ స్థానంలో దీపిక పేరు వినిపిస్తోంది. కత్రిన డేట్స్ సమస్య వల్ల తప్పుకుంటోందట. దాంతో దీపికాతో దర్శకుడు చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఆమెకు కథ కూడా వినిపించినట్టు సమాచారం. ఆమె ఎంపిక దాదాపు పూర్తయిందట.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)