ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమీజాక్సన్ మాట కోసం వెయిటింగ్!

Sat, Sep 05, 2015
అమీ జాక్సన్
అమీ జాక్సన్
అందానికే అందంగా యూత్ చెప్పుకునే పేరు అమీజాక్సన్. తమిళ్ తెరపై మొదటిసారిగా కథానాయికగా కనిపించినప్పుడు ఈ అమ్మాయి, ఏదో ఒకటి, రెండు సినిమాలు చేసేసి వెళ్లిపోతుందనే టాక్ వినిపించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ భామ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు వెళుతోంది. తాజాగా శివకార్తికేయన్ సినిమాలో ఆమెని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ్లో విక్రమ్ సరసన నటించిన ఈ అమ్మాయి, విజయ్ .. ధనుష్ .. ఉదయనిధి స్టాలిన్ వంటి కథానాయకులతో సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ తో రూపొందనున్న ఓ సినిమాకిగాను ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాలో సమంతాను అనుకుంటే, ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో అమీని అడుగుతున్నారట. అయితే శివకార్తికేయన్ జోడీగా చేయడానికి ఆమె అంగీకరిస్తుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)