ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చాక్లెట్ బాయ్ స్టిల్స్ రిలీజ్ చేసిన నాగ్

Sat, Sep 05, 2015
రోషన్
రోషన్
శ్రీకాంత్ కొడుకు రోషన్ కథానాయకుడిగా తాను ఒక సినిమాను నిర్మిస్తున్నట్టుగా నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించబడుతోన్న ఈ సినిమాకి 'నిర్మలా కాన్వెంట్'ను టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి, రోషన్ స్టిల్స్ ను తాజాగా నాగ్ రిలీజ్ చేశాడు.

ఈ స్టిల్స్ లో రోషన్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఊహ .. శ్రీకాంత్ పోలికలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుదురుగా కనిపిస్తోన్న ఈ కుర్రాడు ఈ సినిమాతో చాక్లెట్ బాయ్ .. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకునేలా అనిపిస్తున్నాడు. అందమైన ప్రేమకథా కావ్యంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి పి. రామ్మోహన్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)