ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజాలోను కవి కనిపిస్తాడు!

Fri, Sep 04, 2015
ఇళయరాజా
ఇళయరాజా
పరిమళించే పాటలను ఆస్వాదించేవారికి ఇళయరాజా పేరును పరిచయం చేయవలసిన అవసరం లేదు. మధురమైన పాటలను మంత్రంలా వినేవారికి ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పవలసిన పనిలేదు. ఆయనకి సంగీతమే లోకం .. స్వరాలే ప్రపంచం. ఇళయరాజా స్వరపరచిన పాటలు వింటే అవి మనసులో నుంచి పుట్టినవిగా ఉంటాయి .. మనసును కదిలించేవిగా ఉంటాయి .. మనసును కరిగించేవిగా ఉంటాయి. తన మనసు సున్నితమైన భావాలకు స్పందించే తీరే అందుకు కారణమని ఆయన ఒక సందర్భంలో ఆయన చెప్పారు.

ఆ లక్షణమే తాను కవిత్వాన్ని అమితంగా ఇష్టపడటానికి కారణమైందని అన్నారు. సంగీత ప్రపంచంలో నుంచి అడుగుబయటికి పెడితే, తన మనసు సాహిత్యం వైపు లాగుతుందని ఆయన చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా ఆయన ప్రముఖ రచయితలు రాసిన కవితా సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు తన భావావేశానికి కూడా ఆయన అక్షర రూపం ఇస్తూ ఉంటారట. అలా చాలాకాలం నుంచి తన డైరీలో రాసుకుంటూ వస్తోన్న కవితలకు పుస్తకరూపం ఇవ్వాలనుకుంటూ ఉండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)