ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాల శివతో అఖిల్ రెండవ సినిమా?

Thu, Sep 03, 2015
అఖిల్
అఖిల్
అఖిల్ మొదటి సినిమా దసరాకి పలకరించనుండగా, అతని రెండో సినిమా ఏ దర్శకుడితో ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ కావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో ఎక్కువగా వినిపిస్తోంది. వినాయక్ దర్శకుడిగా వ్యవహరించిన 'అఖిల్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి .. బిజినెస్ జరిగిన తీరు ముందుగానే సక్సెస్ కి సంకేతాలు ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అఖిల్ రెండో సినిమాపై నాగ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అటు మాస్ ఆడియన్స్ ను .. ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఒప్పించగల సమర్థుడుగా కొరటాల శివ ఆయన దృష్టిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనతో నాగ్ సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. ఇక దర్శకుడు ఎవరైనా అఖిల్ రెండో సినిమాను నిర్మించే అవకాశం తనకి ఇవ్వవలసినదిగా బండ్ల గణేష్ అడిగాడట. మరి అందుకు నాగ్ ఏమంటాడో .. కొరటాల ఎలా స్పందిస్తాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)