ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ గాను మెప్పించిన అరవింద్ స్వామి

Tue, Sep 01, 2015
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
విలన్ గా అరవింద్ స్వామి .. అనే మాట వినిపించగానే ఒక్కక్షణం ఆశ్చర్యంతో ఆగిపోని వాళ్లంటూ ఉండరు. అందుకు కారణం అంతకుముందు ఆయన రొమాంటిక్ హీరోగా వెండితెరపై కనిపించడం .. సుకుమారుడైన రాజకుమారుడిలా అనిపించడం. అందగాడు అనే మాటకి అసలైన అర్థంలా కనిపించే అరవింద్ స్వామి పేరు వినగానే, రోజా .. బొంబాయి వంటి సినిమాలు కనులముందు కదలాడతాయి. ఈ సినిమాలు సంచలన విజయాలు సాధించడంతో, ఆయనకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

అయినా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఫలితంగా చాలాకాలం తరువాత ఆయన 'కడలి' సినిమాలో కనిపించాడు. ఆ తరువాత ఆయన 'తని ఒరువన్' అనే సినిమాలో విలన్ గా నటించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో విలన్ గా ఆయన యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ లో ఆయన ముఖ్యపాత్రను పోషించాడని చెబుతున్నారు. ఇక ఇప్పుడైనా ఆయన వరుసగా సినిమాలు చేస్తాడా .. లేదంటే ఎప్పటిలానే తన బిజినెస్ లపై దృష్టిపెడతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)