ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జీవాతో జోడీ కడుతోన్న కాజల్

Sat, Aug 29, 2015
కాజల్
కాజల్
తెలుగు, తమిళ భాషల్లో కాజల్ అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. తన స్థానానికి తగినట్టుగానే ఆమె అగ్రకథానాయకుల జోడీగా మాత్రమే నటిస్తోంది. అలాగే తాజాగా ఆమె 'జీవా' సరసన నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో 'టెంపర్' సినిమాతో హిట్ కొట్టిన కాజల్, ఆ తరువాత పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' .. మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' చిత్రాలను అంగీకరించింది.

అలాగే తమిళ్లో విశాల్ సరసన ఆమె చేసిన 'పాయుం పులి' త్వరలో విడుదల అవుతుండగా, తాజాగా జీవాతో జోడీకట్టడానికి ఓకే చెప్పేసింది. యూత్ ని ఆకట్టుకునే కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా, డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఒకవైపున టాలీవుడ్లోను .. మరో వైపున కోలీవుడ్లోను అగ్రకథానాయకులతో ఒక్కొక్కటిగా సినిమాలను అంగీకరిస్తూ, బాలీవుడ్లోను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోన్న కాజల్ ప్లానింగ్ చూసి మిగతా కథానాయికలు ఆశ్చర్యపోతున్నారట.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)