ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి'ని స్ఫూర్తిగా తీసుకున్న సుదీప్

Sat, Aug 29, 2015
సుదీప్
సుదీప్
'బాహుబలి' సినిమా దర్శకుడు రాజమౌళికి విజయాన్ని మాత్రమే కాదు, ఎంతోమంది దర్శకులకి స్ఫూర్తిని ఇచ్చింది. అలాంటి సినిమా ఒకటి తెరకెక్కించాలని మిగతా దర్శకులు అనుకోవడం సహజమే. అయితే ఒక హీరో .. దర్శకుడిగా మారి అలాంటి సినిమాను రూపొందించాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యానికి గురిచేస్తోన్న ఆ కథానాయకుడు సుదీప్.

కన్నడలో కథానాయకుడిగా వెలుగొందుతోన్న సుదీప్, ఈగ .. బాహుబలి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. బాహుబలిలో నటించిన ఆయనకి అది సాధించిన విజయం స్ఫూర్తిని ఇచ్చిందట. దాంతో ఆయన అలాంటి కథను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లి, కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)