ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కత్రినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట!

Sat, Aug 29, 2015
కత్రినా
కత్రినా
బాలీవుడ్ సెక్సీతార కత్రినా కైఫ్ తొలిసారిగా ఓ తమిళ సినిమాలో నటించనుంది. అదీ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కావడం విశేషం. రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ 'రోబో-2' చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి విదితమే. 300 కోట్ల బడ్జెట్టుతో భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రానికి భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నాడు. ఆ క్రమంలో కథానాయికగా పలువురు తారలను పరిశీలించిన మీదట కత్రినా కైఫ్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్నాళ్లుగా ముంబైలో వుండి చర్చలు సాగిస్తున్న శంకర్ కు కత్రినా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)