ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొత్త సీన్స్ కలుపుకున్న 'శ్రీమంతుడు'

Thu, Aug 27, 2015
మహేష్ బాబు
మహేష్ బాబు
'శ్రీమంతుడు' సినిమాలో కొత్త సీన్స్ కలపనున్నారట అనే వార్త కొన్నిరోజుల క్రితమే వినిపించింది. అయితే ఈ విషయాన్ని గురించి తామింకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ వెంటనే దర్శకుడు కొరటాల శివ చెప్పాడు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ .. రెండు సీన్స్ ను ఈ సినిమాకి కొత్తగా యాడ్ చేస్తున్నట్టుగా చెప్పాడు.

కాస్త లెంగ్త్ గా అనిపిస్తాయేమోనని తీసిన ఆ రెండు సన్నివేశాల క్లిప్స్ ట్రైలర్ లో ఉండటం వలన, చాలామంది వాటిని గురించి ఆసక్తిగా అడగడం జరిగిందని ఆయన అన్నాడు. అలాగే తాము తీసిన కంటెంట్ అంతా అభిమానులకి అందించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఆ రెండు సీన్స్ ను కలుపుతున్నట్టుగా ఆయన చెప్పాడు. రేపు (శుక్రవారం) సాయంత్రం నుంచి ఈ సినిమా ప్రదర్శించబడే అన్ని థియేటర్స్ లోను ఈ సీన్స్ ను కలిపిన సినిమాను చూడవచ్చని అన్నాడు. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకి మరోమారు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)