ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజకు 'కిక్ 2' ఒక గుణపాఠమట!

Thu, Aug 27, 2015
రవితేజ
రవితేజ
'కిక్ 2' సినిమాతో తాను ఒక పాఠం నేర్చుకున్నాననీ .. ఇకపై తన సినిమాల విషయంలో మరింత కేర్ తీసుకుంటానని తాజాగా రవితేజ ఒక సందర్భంలో అన్నాడు. 'కిక్ 2' సినిమా విడుదల రోజునే .. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా వున్నాయనే టాక్ వినిపించింది. దాంతో ఈ సినిమా టీమ్ వెంటనే స్పందించి 20 నిమిషాల నిడివిని తగ్గించింది. ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్ పెంచింది.

ఈ విషయాన్ని గురించి రవితేజ స్పందిస్తూ .. రిలీజ్ కి ముందే తనకి కూడా అక్కడక్కడా కాస్త లెంగ్త్ గా అనిపించిందని చెప్పాడు. ఆ విషయాన్ని తాను దర్శకుడికి చెప్పినా, ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అన్నాడు. ఏదేవైనా దర్శకుడికీ .. తనకి ఇదొక పాఠం వంటిదనీ .. 'కిక్ 3' విషయంలో మరింత కేర్ తీసుకుంటామని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)