ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యూత్ ని 'హర్ట్' చేసిన లక్ష్మీమీనన్!

Tue, Aug 25, 2015
లక్ష్మీమీనన్
లక్ష్మీమీనన్
ప్రేమా .. దోమా అంటూ వెంటపడే వాళ్లంటే తనకి మా చెడ్డ చిరాకని చెబుతోంది లక్ష్మీమీనన్. అంతేకాదు పెళ్లిచేసుకుంటామని అడిగేవారి విషయంలోనూ తనకి సేమ్ ఫీలింగ్ కలుగుతుందని అంటోంది. సాధారణంగా కథానాయికలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు .. పెళ్లెప్పుడు? అనే ప్రశ్నని అడగడం జరుగుతూ వుంటుంది. కానీ కొంతమంది కథానాయికలను ఇకముందు ఆ ప్రశ్న వేయనవసరం లేదని తెలుస్తోంది. అలాంటి కథానాయికలలో లక్ష్మీమీనన్ కూడా చేరిపోయినట్టుగా ఆమె మాటల వలన అర్థమవుతోంది.

కోలీవుడ్ తెరపై కాస్త పద్ధతిగా కనిపించే ఈ అమ్మాయి, కొంచె సిగ్గుపడుతూ అప్పుడే పెళ్లేంటి? అంటుందని అనుకుంటే, అసలు పెళ్లే చేసుకోనంటూ షాకిచ్చింది. ప్రేమలో పడటమన్నా .. పెళ్లిచేసుకోవడమన్నా తనకి ఎంతమాత్రం ఇష్టం ఉండదని స్పష్టం చేసింది. తెరపై ప్రేమకి ప్రతి రూపంగా కనిపించే ఈ అమ్మాయి, ఈ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడంతో అక్కడి యూత్ బాగా హర్ట్ అయిందని వినికిడి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)