ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గబ్బర్ సింగ్' ఇష్టమన్న చిరూ

Mon, Aug 24, 2015
సాయిధరం, చిరంజీవి, హరీష్ శంకర్
సాయిధరం, చిరంజీవి, హరీష్ శంకర్
''గబ్బర్ సింగ్ నాకు ఎంతో ఇష్టమైన సినిమా .. ఇలాంటి సినిమా చేయాలి .. ఇలాంటి దర్శకుడు నాకు కావాలి'' ఈ మాటలు అన్నది పరిశ్రమకి కొత్తగా వచ్చిన కథానాయకుడు కాదు .. మెగాస్టార్ చిరంజీవి. నిన్న రాత్రి హైదరాబాదు -శిల్పకళా వేదికలో జరిగిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో వేడుకలో మాట్లాడుతూ ఆయన ఇలా తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ - రెజీన జంటగా నటించిన ఈ సినిమా ఆడియో వేడుకకి ముఖ్యఅతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ తో హరీష్ శంకర్ చేసిన 'గబ్బర్ సింగ్' తనకి చాలా ఇష్టమని చెప్పారు. ఇలాంటి సినిమాలో .. ఇలాంటి దర్శకుడితో చేయాలనిపించిందని అన్నారు. సాయిధరంతో హరీష్ చేసిన ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చిందంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)